‘రాజా సింగ్.. నువ్వో గల్లీ లీడర్‌వి.. స్థాయిని గుర్తు పెట్టుకో..’

by Shyam |   ( Updated:2021-09-07 09:00:15.0  )
Mettu Saikumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజాసింగ్… నువ్వు ఒక గల్లీ లీడర్‌వి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీది కాదని తెలంగాణ కాంగ్రెస్ మత్స్యకార చైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆవులు, మతం పేరు చెప్పుకుని పూట గడుపుకునే వ్యక్తి రాజాసింగ్ అని ధ్వజమెత్తారు. ప్రపంచం గుర్తిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీని విమర్శిస్తావా..? నువ్వెంత నీ స్థాయి ఎంత..? గోషామహాల్ నియోజకవర్గంలో భవనాలు కడితే కమిషన్ అడుక్కోని బతికే నువ్వు రాహుల్ గాంధీని విమర్శించడమంటే ఆకాశం వైపు ఉమ్మి వేయడమే’’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కార్యక్రమాలకు రానివ్వకపోవడంతో విలువ పెంచుకోవడానికి రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తున్నాడని, వెంటనే వాటిని మానుకోవాలన్నారు. ఇప్పటికైనా స్థాయికి తగిట్లు మాట్లాడాలని, లేకుంటే తగిన రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story