- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూరులో ఫ్లెక్సీల లొల్లి.. అధికారిక కార్యక్రమంలో మా ఫొటోలెక్కడా..?
దిశ, ఆర్మూర్: ఆర్మూరు మున్సిపల్ అధికారుల నిర్వాకం మరీ విడ్డూరంగా తయారైంది. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ పార్టీ వేడుకను తలపించేలా మార్చేసి స్థానికంగా ప్రోటోకాల్ వివాదానికి తెర తీశారు. ప్రతిపక్షాలను విస్మరించి తలవంపులు కొని తెచ్చుకుంటున్నారు. అధికార పక్షం భజనలో పూర్తిగా లీనమై ప్రోటోకాల్‌నే మర్చిపోతున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పురపాలక సంఘానికి సంబంధం లేని వ్యక్తుల ఫొటోలు ఉండడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అసలేం జరిగింది..?
ఆర్మూరు పట్టణంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీవో ఆఫీసులో రూరల్, ఓ ఫంక్షన్ హాలులో అర్బన్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయడంతో పట్టణంలోని కెనాల్ కట్ట బ్రిడ్జితోపాటు పలు ప్రధాన కూడళ్లలో పురపాలక సంఘం పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి.
ప్రతిపక్ష కౌన్సిలర్లకు అవమానం..
మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లతో పాటు టీఆర్ఎస్ నాయకుల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. పురపాలక సంఘం నిధుల నుంచి ఖర్చుచేసి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో సంబంధం లేని వ్యక్తుల ఫొటోలు ఉండడం వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సోదరుడు, చైర్ పర్సన్ భర్తతోపాటు పలువురు మహిళా కౌన్సిలర్ల భర్తల ఫొటోలు ఉన్నాయి. ప్రతిపక్ష కౌన్సిలర్ల ఫొటోలు కనిపించడంలేదు. పాలకవర్గంలో భాగమైన ప్రతిపక్ష నాయకుల ఫొటోలు లేకుండా చేసి వారి పదవిని కించపరచడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పక్షానికి కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలను విస్మరించిన అధికారులు ఇందుకు సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ ప్రతిపక్షాలను అవమానపరిచేలా వ్యవహరించడం టీఆర్ఎస్ నాయకుల అహంకారానికి నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఆ ఫ్లెక్సీలతో మాకు సంబంధం లేదు..
ఆ ఫ్లెక్సీలతో మాకు సంబంధం లేదు. చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన చోట వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రమే మేం ప్రింట్ చేయించాం. పట్టణంలో మరెక్కడా మున్సిపాలిటీ తరఫున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు. -జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్.