- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుమారం రేపుతున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసు శాఖలోని కొందరి సహకారంతో తపాలా ఓట్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామంటూ ప్రకాశం జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. జూలై 30న మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్‌రెడ్డి తమకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్రా వెంకటరెడ్డితోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నర్రా వెంకటరెడ్డి మాట్లాడారు.
గత ఎన్నికల్లో తనతోపాటు మల్లారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారావు, వేణు, హోంగార్డు కిషోర్, ఓ మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి కలిసి జిల్లా వ్యాప్తంగా 645కుపైగా పోస్టల్ బ్యాలెట్ల వివరాలు సేకరించి పార్టీకి ఇచ్చామన్నారు. తనకు నలుగురు సహకరించారు కాబట్టే ఆ పనిచేయగలిగినట్లు చెప్పుకొచ్చారు. తమ కృషిని గుర్తించి మేలు చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. గత ప్రభుత్వంలో ఉన్న వారే ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని.. మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు.
వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్ దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నర్రా వెంకటరెడ్డిపై వేటు వేశారు. ఆయనను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.