వివాదం రేపిన తెలుగు అకాడమి పేరు మార్పు

by srinivas |
వివాదం రేపిన తెలుగు అకాడమి పేరు మార్పు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు అకాడమి పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు-సంస్కృత అకాడమిగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు అకాడమి పేరు మార్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమి పేరును మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సంస్కృత భాష అభివృద్ధి కోసమైతే ప్రత్యేక అకాడమి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు అకాడమి అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలు ముందుకు రావాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

తెలుగు అకాడమి పేరు మార్చడం : మండలి

తెలుగు అకాడమి పేరు మార్చడం విచారకరమని మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు అకాడమికి రావాల్సిన నిధులు రప్పించలేకపోయారని విమర్శించారు. అకాడమిని ఏర్పాటు చేసినా… ఏ పనులు చేయలేదన్నారు. జగన్‌ ఇప్పటికే తెలుగు మాధ్యమానికి మంగళం పాడారని, తెలుగు అకాడమిలో సంస్కృతాన్ని కలపడం భావ్యం కాదన్నారు. సీఎం జగన్‌ తెలుగు అకాడమి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమన్నారు. తెలుగును అంతం చేయడానికే పుట్టినట్టు ప్రభుత్వం వ్యవహరించడం విచారకరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed