కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలకు కసరత్తు!

by Sridhar Babu |

దిశ, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల ప్రక్రియకు ఉన్నత విద్యాశాఖలో కసరత్తులు ప్రారంభయ్యాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల అనుమతి కోసం రెడీ చేసిన దస్త్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అంతే కాకుండా ఆయా జిల్లాల వారీగా జాబితాను తయారు చేయాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 3,800 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాను పంపించేందుకు జిల్లాల ఉన్నత విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి 8 ఏళ్ల సీనియారిటీని బదిలీకి ప్రాతిపదికగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, స్పౌస్ గ్రౌండ్, మెడికల్ గ్రౌండ్స్ కారణాలు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నెలాఖారు లేదా జులై మొదటి వారంలో కాంట్రాక్టు లెక్చర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story