బిగ్ బాస్ హౌజ్‌లో ఫోన్ యూజ్

by Shyam |   ( Updated:2020-12-28 01:15:27.0  )
బిగ్ బాస్ హౌజ్‌లో ఫోన్ యూజ్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హౌజ్ అంటే అన్ని బంధాలకు దూరంగా..అక్కడికి వచ్చిన కంటెస్టెంట్‌లతో కొత్త బంధాలు ఏర్పరుచుకుని బతకడమే. హౌజ్‌లో ఉన్నంత కాలం అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ బయటి వ్యక్తులతో మాట్లాడటం ఉండదు. టీవీ, సెల్‌ఫోన్ లాంటి ఎక్స్‌ట్రా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడం ఉండదు. కంటెస్టెంట్స్ ఆడియన్స్‌కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి తప్ప..వాళ్లకు అలాంటివి అందించడం ఉండదు. అయితే తమిళ బిగ్ బాస్ హౌజ్‌‌లో ఫోన్ వాడుతున్నారనే వార్త ప్రజెంట్ వైరల్ అయింది. లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న షో సూపర్ పాపులర్ అయినా..లేటెస్ట్ న్యూస్ కొంచెం నెగెటివిటి క్రియేట్ అయ్యేలా చేసింది.

కమల్ వీకెండ్‌లో కంటెస్టెంట్లతో మాట్లాడుతుండగా..సోమ్‌శేఖర్ అనే ఇంటి సభ్యుడు ఫోన్ యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై మండిపడుతున్నారు. తను మైక్రోఫోన్ బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటున్నాడని, ఫోన్ కాదని తనకు కొందరు సపోర్ట్ చేస్తున్నా..చాలా మంది ప్రేక్షకుల్లో కంటెస్టెంట్ సోమ్ శేఖర్ మీద ఆల్రెడీ నెగెటివిటీ పడిపోయింది. సోమ్ శేఖర్ ఫోన్ వాడుతున్నాడని..ఆ ఫోన్‌లో కమల్ హాసన్ వీకెండ్‌లో ఎవరెవరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడనే స్క్రిప్ట్ ఉండి ఉంటుందని అంటున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం ప్రేక్షకులను చీట్ చేస్తుందంటున్నారు. మరికొందరేమో అది స్టామర్‌ను నియంత్రించే పరికరమని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed