జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లు..

by Anukaran |   ( Updated:2021-04-22 06:44:13.0  )
జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో గ్రేటర్​ హైదరాబాద్​లో 70 కంటైన్​మెంట్​ జోన్లు విధించారు. ఒకే భవనంలో ఐదు కరోనా కేసులు వస్తే హౌస్ క్లస్టర్ గానూ, ఒక ఏరియాలో 5 నుంచి పది కేసులు వస్తే మైక్రో కంటైన్​మెంట్​ జోన్లుగానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్​ఎంసీలోని 30 సర్కిళ్లలో 63 మైక్రో కంటైన్​ మెంట్​జోన్లను అధికారులు ప్రకటించారు.

అయితే గతంలో మాదిరిగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్స్​ ఏర్పాటు చేయడం లేదు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్‌చెరు, మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, అంబర్‌పేట్, ముషీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట్‌ లోని పలు ప్రాంతాల్లో మొత్తం 70 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసింది.

List of Containment Zones..

Advertisement

Next Story

Most Viewed