విశాఖలో తప్పిన పెను ప్రమాదం

by Anukaran |   ( Updated:2020-08-30 11:45:40.0  )
విశాఖలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సిటీ పరిధిలోని గాజువాక వడ్లపూడి జంక్షన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. గాజువాక వైపు నుండి అనకాపల్లి వెళ్లే మార్గంలో భారీ కంటైనర్… లారీ క్యాబిన్ నుండి విడిపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో దగ్గర్లో ఎటువంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని క్రేన్ ల ద్వారా కంటైనర్ ను పక్కకు తప్పించారు. దీంతో అరగంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

Next Story

Most Viewed