త్వరలో పెరగనున్న గృహ వినియోగ వస్తువుల ధరలు!

by Harish |
Consumers
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ ఉత్పత్తుల దగ్గరి నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికారాల వరకు సరుకుల రవాణా ధరలు ఇటీవల తగ్గు ముఖం పట్టాయి. ఇటీవల ఎగుమతులు, దిగుమతుల్లో ఎదురైన కంటైనర్ల లభ్యత కూడా మెరుగ్గా ఉంది. అయితే, ప్రధానంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరగనున్న నేపథ్యంలో ఈ ఉత్పత్తులు, సరుకుల ధరలు డిసెంబర్‌లో 5-6 శాతం పెరగనున్నాయని, ఆ తర్వాత 2022లో మరో 10-12 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాబోయె రెండు మూడు నెలల్లో గృహ వినియోగ వస్తువుల ధరలు పెరగవచ్చని, వీటిలో దుస్తుల ధరలకు సంబంధించి ఎగుమతిదారులు పెద్ద బ్రాండ్ సంస్థలతో అధిక ధరలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్టు పరిశ్రమ వర్గాలు వివరించాయి.

‘ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. అంతర్జాతీయంగా మెరుగైన పరిస్థితులు ఉండటంతో అతిపెద్ద బ్రాండ్ల దుస్తుల కంపెనీలు రవాణా ఖర్చులను కొంత తగ్గించుకునేందుకు అంగీకరించాయని’ నోయిడా దుస్తుల ఎగుమతుల గ్రూప్ అధ్యక్షుడు లలిత్ తుక్రాల్ చెప్పారు. ఇటీవల ప్రతికూల వాతావరణం కారణంగా భారత్‌లో దిగుబడి తగ్గిపోవడంతో బాస్మతి బియ్యం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికే గరిష్ఠంగా ఉన్నాయి. కంటైనర్ లభ్యత బాగుండటంతో రవాణా ఖర్చులు 5-15 శాతం తగ్గాయని, కానీ ఇది గతేడాదితో పోలిస్తే ఇంకా 5-10 శాతం ఎక్కువేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story