షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉండొచ్చు..!

by Anukaran |
షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉండొచ్చు..!
X

దిశ, వెబ్ డెస్క్ :

షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఒక రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పంజాబ్‌కు చెందిన కొందరు వ్యక్తులకు సంబంధించిన కేసులో ఈ విధంగా తీర్పునిచ్చింది.

అయితే, 2004లో ఈవీ చిన్నయ్య అనే కేసులో షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు అవసరం లేదని నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ధర్మాసనం పేర్కొన్నది. కాగా, ఒకే అంశానికి సంబంధించి రెండు వేర్వేరు తీర్పులను రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించడంతో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

Advertisement

Next Story