- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ పోలీసులు గొప్పగా పనిచేస్తున్నారు
by Shyam |

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: దేశంలోనే తెలంగాణ పోలీసులు ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్‌లో 499మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన హోంమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.700 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజల భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ప్రతి క్షణం పనిచేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అతికొద్ది సమయంలోనే నేరస్తులను పట్టుకుంటున్నట్టు తెలిపారు.
Next Story