కరోనా కాటుకు కానిస్టేబుల్ బలి

by vinod kumar |
Constable Nageshwara Rao
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యలగొండ నాగేశ్వర రావు(36) కరోనాతో మరణించారు. ఇటీవల కరోనా సోకిన నాగేశ్వరరావు 15 రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందాడు. గత నాలుగురోజుల క్రితం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. అయినా.. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేరి చికిత్స తీసుకున్నాడు. బుధవారం పరిస్థితి విషమించి, కన్నుమూశారు. నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల కోదాడ డీఎస్పీ రఘు, రూరల్ సీఐ శివరామిరెడ్డి, రూరల్ ఎస్ఐ సైదులు గౌడ్, పోలీసులు సిబ్బంది సంతాపం తెలిపారు.

Advertisement

Next Story