రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

by Shyam |
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
X

దిశ, నల్లగొండ :

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు.వివరాల్లోకివెళితే..చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెం స్టేజీ వద్ద ఓ టాటా ఎస్ వాహనం డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌ను మరో డీసీఎం వచ్చి ఢీకొనడంతో చౌటుప్పల్ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ జగన్నాథానికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే అతన్నిమెరుగైన చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మ‌ృతి చెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.కాగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పొయిన జగన్నాథం మృతదేహానికి డీసీపీ నారాయణరెడ్డి నివాళ్లర్పించారు.

Tags: road accident, constable died, yadadri dist, dcp satyanarayana reddy condolences

Advertisement

Next Story