లాడ్జిలో పురుగుల మందు తాగిన కానిస్టేబుల్

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో కలకలం రేగింది. గవర్నర్‌పేటలోని ఓ లాడ్జిలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కానిస్టేబుల్‌ను గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కానిస్టేబుల్‌ను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించాడా లేకుంటే.. ఇతర ఏమైనా కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Advertisement