యూనివర్శిటీల నిర్వీర్యానికి కుట్ర..

by Shyam |
యూనివర్శిటీల నిర్వీర్యానికి కుట్ర..
X

దిశ, హైదరాబాద్
విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ యూనివర్శిటీల నిర్వీర్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి అన్ని యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి మాట్లాడుతూ.. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా యూనివర్సిటీ అభివృద్ధి చెందకుండా కుట్రపన్నుతోందని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించి ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుమన్ శంకర్, ఓయూ అధ్యక్షులు రవీంద్రనాథ్ నాయకులు ఎల్లస్వామి, రమేష్ పాల్గొన్నారు.

tags; abvp leaders rally, ou arts college, conspirancy to undermine the universities


Next Story