- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాను జయించినా.. ఊపిరి తీసిన ఉద్యోగం
దిశ, వెబ్‌డెస్క్ : విధి వంచితుడు అంటే అతడేనేమో. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నా.. మృత్యు పాశం అతడిని వెంటాడింది. కొవిడ్ కోరలు వంచిన విజయ గర్వంతో విధుల్లోకి ఎక్కిన అతడిని యమధర్మరాజు కరెంటు రూపంలో కబలించాడు. గురవారం రాత్రి శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ నాయక్ తండా వాసి మృతిచెందిన విషయం తెలిసిందే. అతడు విధుల్లో చేరిస గంటల వ్యవధిలోనే ఊపిరి వదిలాడు.
జగన్ నాయక్ తండాకు చెందిన దరావత్ సుందర్ నాయక్ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. సుందర్ నాయక్‌కు నెల రోజుల క్రితమే కరోనాపాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామంలోనే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందాడు. పూర్తిగా కోలుకోవడంతో గురువారం సాయంత్రమే శ్రీశైలం వెళ్లి రాత్రి 9గంటల సమయంలో విధుల్లో చేరాడు. పని ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ప్రమాదం జరిగి సుందర్ నాయక్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాధ చాయలు అములుకున్నాయి. అప్పటి వరకు తమతో ఉన్న వ్యక్తి ఇకలేడని తెలిసే సరికి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సుందర్ నాయక్ కు తండ్రి నాగేశ్వరరావు (కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్),తల్లి కమల, భార్య ప్రమీల, ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు.