వలస కార్మికులకు ఉత్తమ్ చేయూత

by Shyam |
వలస కార్మికులకు ఉత్తమ్ చేయూత
X

దిశ, నల్లగొండ: వలస కార్మికులకు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేయూతనందించారు. జిల్లావ్యాప్తంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్మికులు వెళ్తున్న బస్సును ఉత్తమ్.. శనివారం జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు వలస కార్మికుల కోసం బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తమ్ విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story