టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు: రేవంత్

by Shyam |
టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు: రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోడీ వైపు ఉంటారో లేకుంటే రైతుల వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేస్తోందన్న రేవంత్‌రెడ్డి.. మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ నేతలను అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story