- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అందమైన అబద్ధాలతో గెలిచారు’
హైదరాబాద్: అందమైన అబద్ధాలు చెప్పిన టీఆర్ఎస్ నాయకులు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలిపించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మీద ఆశతో ఓటు వేసిన వారికి చివరకు నిరాశే మిగిలిందని.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని రేవంత్ ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ పై నిప్పులు చెరిగారు.
వచ్చే ఆరు నెలల్లో ఖమ్మం, వరంగల్, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల కోసమే సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్ కట్టడం, సచివాలయం కూల్చడం తప్ప మరేమీ చేయలేదని ఎద్దేవా చేశారు. కానీ, అద్భుతాలు సృష్టించామని కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు అక్టోబర్ 3 నుంచి చైతన్య యాత్ర చేపడుతానని ఆయన స్పష్టం చేశారు.