- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి : కాంగ్రెస్

దిశ, నల్లగొండ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్ధి సభవత్ రాములు నాయక్‌కు మద్దతుగా నల్లగొండ పట్టణంలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా అడ్వాకేట్ దంపతుల హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. నిందితులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా గుర్తుకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఘన విజయంతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా మీద కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు ఉంటేనే ఇక్కడకు వచ్చి హామీల వర్షం కురిపిస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్ని కుతంత్రాలు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం తధ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం తను చేపట్టనున్న పాదయాత్రను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు మంజూరుచేయట్లేదని ప్రశ్నించారు. 2001 నుంచి తెలంగాణా ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన రాములు నాయక్ ఉన్నారని గుర్తచేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ఎన్నిసార్లు నల్లగొండ పట్టణానికి వచ్చాడో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు బ్రోకర్ లాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పనిచేస్తుంటే రాములు నాయక్ ప్రజల పక్షాన పోరాటం చేస్తాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి బలరాం నాయక్, రాంరెడ్డి దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.