- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్తగా ఇవ్వకపోగా.. ఉద్యోగాలు ఊడగొట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్
దిశ, జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో నిరుద్యోగ చైతన్య దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను రోడ్డున పడేసిందని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారని అన్నారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాలు కల్పించకపోగా.. 14 వేల ఫీల్డ్ అసిస్టెంట్లు, 30వేల మంది స్కావెంజర్లు, 450 మంది ఉద్యానశాఖ మండలస్థాయి ఉద్యోగులను తొలగించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. ఎన్నికలు రాగానే అనేక హామీలు ఇచ్చి, అనంతరం వాటిని విస్మరిస్తు్న్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డీ విరుస్తోందని, వంటగ్యాస్ ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని శాపం పెట్టారు. ఈ దీక్షలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధు, పట్టణ అధ్యక్షులు మోహన్, హరీశ్, రఘువీర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్, రాజేందర్, రాధా కిషన్, జగన్, ప్రభాకర్, నెహాల్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.