- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
5వేలు ఇస్తే ఓట్లు పడుతాయని కేసీఆర్ ఆలోచన
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అసెంబ్లీలోనే కరోనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని, దీన్ని ప్రజలందరూ గమనించారన్నారు. దేశంలో కరోనా గురించి రాహుల్ గాంధీ జనవరిలో చెప్పిన తర్వాతే నెలరోజులకు ప్రధాని స్పందించారని, ఆ తర్వాతే కేసీఆర్ పట్టించుకున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు మాటలతో టైం పాస్ చేస్తున్నారని, కరోనా కట్టడికి ఎలాంటి ప్రణాళికలు లేవని ఆరోపించారు. ప్రజలంటే సీఎం కేసీఆర్‌కి భయం లేదని, బలహీనతను పట్టి పాలన చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు 5వేలో, 10వేలో ఇస్తే ఓట్లు పడతాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు, సీఎస్‌కు కనీసం హైకోర్టు అంటే కూడా భయం లేదని ధ్వజమెత్తారు.