- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోట శ్రీనివాసరావు కోడిని తలపిస్తున్న కేసీఆర్ జీవోలు
by Shyam |
X
దిశ, హాలియా: సీఎం కేసీఆర్ జీవోలు కోట శ్రీనివాసరావు సినిమాలో కోడిని వేలాడదీసే విధంగా ఉంటాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జానారెడ్డి గెలిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి, సాగర్ నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జానారెడ్డి చాలా సౌమ్యుడు అన్నారు. కులాలకు మతాలకు చెందిన వ్యక్తి కాదన్నారు. అన్ని కులాలను, దేశంలో అన్ని మతాలను గౌరవించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జానారెడ్డి పాత్ర చాలా కీలకమైనది అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ను చూసి ఇవ్వలేదని అన్నారు. జానారెడ్డిని గెలిపించుకుంటే నిరుద్యోగ యువతకు భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, బడుగు బలహీన వర్గాలకు నిధులు సాధించుకోవచ్చన్నారు.
Advertisement
Next Story