- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేవంత్ ఒక్కడే హీరోనా? ఎమ్మెల్యే జగ్గారెడ్డి

దిశ, మెదక్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో హీరోలే లేరని, రేవంత్ రెడ్డి ఒక్కరే హీరో అంటూ ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాలన్నారు. వెంటనే పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించాలని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని జగ్గారెడ్డి కోరారు. నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఎమ్మెల్యే లేదా నాయకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి సమస్యలపై కోర్ కమిటీలో చర్చించాకే పీసీసీ చీఫ్ ప్రకటన జారీ చేస్తారని, ఈ మేరకు ఉద్యమాలు చేసే సంప్రదాయం ఉందన్నారు. ఈ సంస్కృతిని రేవంత్‌రెడ్డి బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. గతంలో మాదిరిగానే రేవంత్‌రెడ్డి క్రమశిక్షణతో ఉండాలన్నారు. కాంగ్రెస్‌లో మొదట పార్టీ ఆతర్వాత సోనియాగాంధీ, రాహుల్‌లే హీరోలన్నారు.
tags : congress MLA Jagga Reddy, mp revanth reddy Behavior, khuntia, utham kumar reddy, medak