- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రచ్చ బండ’ నిర్వహిస్తే ప్రభుత్వానికి భయమెందుకు..?

దిశ, షాద్ నగర్: సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ ‘రైతులతో రచ్చబండ’ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పింది. ఈ కార్యక్రమానికి తరలివెళ్తారనే అనుమానంతో షాద్ నగర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మధు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగా రాజు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చల్లా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమానికి తరలి వెళ్తున్న కిసాన్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రైతు గురించి పోరాటం చేసే నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం సరైనచర్య కాదన్నారు. రచ్చబండ నిర్వహిస్తే ప్రభుత్వానికి భయమెందుకు అని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.