- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దమ్ముంటే రాజీనామా చేయ్’.. ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వార్నింగ్
దిశ, మణుగూరు: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో గెలిచి.. అభివృద్ధి సాకుతో టీఆర్ఎస్ కండువా కుప్పుకున్నారని.. అయినా దళితులు, గిరిజనులు, మైనార్టీలకు ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. రేగా కాంతారావుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దళితుల కోసం ఆత్మగౌరవ సభ పెట్టి రేవంత్ రెడ్డి పోరాడుతుంటే.. టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేవలం కేసీఆర్ మెప్పు కోసమే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీని విమర్శించే ముందు.. రేగా కాంతారావు తన పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ జెండాపై గెలవాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ అధ్యక్షుడు పిరానాకి నవీన్, పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ రషీద్ తదితరులు పాల్గొన్నారు.