- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కలెక్టర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి’
దిశ ,సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల సమయంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమిరెడ్డిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని, లేదా బదిలీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీసం నాగరాజు యాదవ్ మాట్లాడుతూ… ఈ దుబ్బాక ఉపఎన్నికల సమయంలో గత వారం రోజులుగా వివిధ పత్రికల్లో, టీవీ ఛానెల్‌లలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వార్తలు ప్రచారం జరుగుతోందన్నారు.
బాధ్యత గల పదవిలో ఉండి కూడా కనీసం వివరణ కూడా ఇవ్వలేదని, ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తే ప్రతిపక్ష పార్టీల నాయకులకు, ప్రజలకు అనేక అనుమానాలకు తావిస్తాయన్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆస్కారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు సుజావుగా, పక్షపాతం లేకుండా జరిగేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఫిర్యాదులో కోరామన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, లేదా బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.