'ఎమ్మెల్యే గువ్వల ఆగడాలకు గుణపాఠం తప్పదు'

by Sridhar Babu |
MBNR-Congress-on-TRS-MLA-1
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుని దాడుల సంస్కృతి ప్రోత్సహిస్తున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొడిదెల రాము ఆరోపించారు. మంగళవారం తన వాహనంపై దాడి చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డీఎస్పీ నరసింహులుకు స్థానిక నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురవి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డితోపాటు స్థానిక నేతలతో కలిసి నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి కేకు కట్ చేసి తిరిగి వస్తుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ గుండాలు రాళ్లతో దాడి చేయడంతో తన వాహనం ధ్వంసం అయిందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాడులతో విపక్ష పార్టీలలో భయాందోళనలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగానే దాడులు చేస్తున్నారని, కానీ.. కాంగ్రెస్ పార్టీ కానీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు బెదిరేదిలేదని అన్నారు.

యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అజయ్ మాట్లాడుతూ రాబోయే రోజులలో గువ్వల బాలరాజు దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మీడియాపై కూడా అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, కౌన్సిలర్ గౌరీ శంకర్, నాగర్ కర్నూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ గౌడ్, ఎన్ఎస్ యు ఐ తాలుకా అధ్యక్షుడు సంతోష్ నాయక్, కంచి వెంకటేష్, సోషల్ మీడియా సునీల్, మండల కో-ఆర్డినేటర్ వెంకటేష్ గౌడ్, చందర్, ఎన్ఎస్ యుఐ తాలుకా ప్రధాన కార్యదర్శి లడ్డు యాదవ్, శ్రీను, హన్మంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed