- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘సాగర్‌లో కరోనా పేషెంట్ల ప్రచారం.. ఈసీకి ఫిర్యాదు’
by Shyam |

X
దిశ, హాలియా: సాగర్ ఎన్నికల ప్రచారంలో కరోనా వైరస్ సోకిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మాడుగులపల్లి మండలానికి ఇన్‌చార్జీగా ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అనుచరులు 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాడుగులపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు ప్రచారంలో దగ్గుతూ, జ్వరంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ నాయకులపై వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకుల ప్రచారంతో కరోనా వైరస్.. మండలం మొత్తం వ్యాపించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు వారి ప్రచారానికి దూరంగా ఉంటే మేలని చెప్పారు.
Next Story