పీసీసీ పదవికి నేనే అర్హుడిని : వీహెచ్

by Shyam |
Congress leader VH
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ఓటమికి బాధ్యత వహించిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీనియర్ నేతలంతా పీసీసీ చీఫ్ పదవి కోసం పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు ఎవరికీ వారు తామే పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నారు. తాజాగా ఆదివారం పార్టీ మరో సీనియర్ నేత వీ.హనుమంతరావు సైతం తానే పీసీసీ పదవికి అర్హుడిని అని ప్రకటిచారు. అంతేగాకుండా ఎప్పుడూ అగ్రకులాలకే పదవులు ఇస్తారా?, ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాంద్ చేశారు. టీపీసీపీ రేసులో తానే ముందున్నానని, అన్ని రకాలుగా తానే అర్హుడిని అని ప్రకటించారు. తాను తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed