- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోండి
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా బేసిన్‌పై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపును అడ్డుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమకు టెండర్లు పిలిచారన్నారు. దీనిపై కేఆర్ఎంబీ, ప్రతిపక్షాలు అడ్డు చెప్పుతున్నా ఏపీ ఆపడం లేదని లేఖలో సూచించారు.
రాయలసీమ ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ మొత్తం ఏడారిగా మారుతుందని, ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో దీనిపై చర్చించే అవకాశం ఉండేదని, కానీ ఎందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని సూచించారో తెలపాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మూడో టీఎంసీ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేస్తున్నారని, కానీ రోజుకు 6టీఎంసీలకుపైగా తరలించుకునేందుకు ఏపీ రాయలసీమను నిర్మిస్తుందని లేఖలో సూచించారు. వెంటనే ఏపీ ప్రాజెక్టులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ లేఖలో డిమాండ్ చేశారు.