జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ విధించాలి: షబ్బీర్

by Shyam |
జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ విధించాలి: షబ్బీర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 15రోజుల్లో రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలన్నారు. అత్యవసర సమాయాల్లో కొవిడ్-19 రోగులకు వైద్యాన్ని నిరాకరించవద్దని, అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed