పెద్దమనిషి అని చూడకుండా కొట్టారు: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్

by Shyam |
పెద్దమనిషి అని చూడకుండా కొట్టారు: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్
X

దిశ, మహబూబ్ నగర్: పోలీసులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు అనుసరిస్తున్న తీరు ఏ మాత్రం బాగులేదంటూ ఫైరయ్యారు. వివరాల్లోకి వెళితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్​ నేతలపై పోలీసులు అనుసరిస్తున్న వ్యవహారశైలి సరిగాలేదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు పుల్లూరు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని ఆయన ఖండించారు. పుల్లూరు గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి ఎరువుల కొనుగోలు కోసం పుల్లూరు చెక్​పోస్టు మీదుగా అలంపూర్​ వెళ్తుండగా పోలీసులు నాగేశ్వర్​ రెడ్డిని ఆపి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పెద్దమనిషి అని చూడకుండా కొట్టారని పేర్కొన్నారు. బాధ్యత గల పోలీసులు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో ఇలా చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా పోలీసులు అధికారులకు సంపత్​​ సూచించారు.


Advertisement
Next Story

Most Viewed