పేదల పై మోదీ మూడో దాడి: రాహుల్

by Anukaran |   ( Updated:2020-09-09 10:58:39.0  )
పేదల పై మోదీ మూడో దాడి: రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పేరుతో అసంఘటిత వర్గం పై ప్రధాని మోదీ మూడో దాడి చేశారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదలు, మధ్య తరగతి, చిరు వ్యాపారులు రోజు పని చేసుకొని పొట్ట నింపుకుంటారని గుర్తు చేసిన రాహుల్ గాంధీ.. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా లాక్ డౌన్ పేరుతో వారి జీవనం మీద దాడి చేశారని విమర్శించారు.

కేవలం 21 రోజుల్లోనే కరోనాను తరిమేస్తామని చెప్పిన మోదీ.. లాక్ డౌన్‌ పేరుతో పేద ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. వారికి కనీస వసతులు కూడా కల్పించలేదని.. దీంతో వలస కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు లాక్‌డౌన్‌లో పేద ప్రజల బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయాల్సిందన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని చెప్పారు.

బీజేపీ తీసుకొచ్చిన లాక్‌డౌన్.. కరోనా పై ప్రభావం చూపలేదన్న రాహుల్ గాంధీ.. హిందూస్తాన్‌లో ఉన్న పేద ప్రజల పై తీవ్ర ప్రభావం చూపిందని గుర్తు చేశారు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. రైతులు, చిరు వ్యాపారులపై ప్రభావం చూపిందన్నారు. ఈ నేపథ్యంలోనే అసంఘటిత వర్గం పై మోదీ మూడో దాడి చేశారంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story