గోదావరి జలాలతో మూసీ ప్రాజెక్టును నింపాలి

by Shyam |

దిశ, నల్లగొండ: గోదావరి జలాలతో మూసీ ప్రాజెక్టును నింపాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం స్థానిక రైతులతో కలిసి మూసీ ప్రాజెక్టును సందర్శించిన ఆయన మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు గేటు ఊడిపోయి 8నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మూసీ ప్రాజెక్టు దుస్థితికి మంత్రి జగదీశ్‌రెడ్డే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దామోదర్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో విడుదల చేసిన రూ.20 కోట్లను ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నారన్నారు. మూసీ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed