- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఏడేళ్లుగా మోసం చేస్తున్నారు: మధు యాష్కీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత 7 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అమలుకు నోచుకోని హామీలను ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలతో మధు యాష్కీ గౌడ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు, నిజామాబాద్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ ఆస్తులను అమ్మడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆస్తులను అమ్మకానికి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కేశ మహేష్, యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.