కలెక్టర్ ఆదేశించినా… నిర్లక్ష్యంగా అధికారులు

దిశ, హుస్నాబాద్: డంపింగ్ షెడ్డు కింద మూగజీవాలును కట్టేసి.. ఊరిమీది చెత్తంతా రోడ్డు పక్కన వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బెజ్జంకి మండలం బేగంపేట గ్రామ శివారులో ఇటీవల డంపింగ్ షెడ్డు నిర్మాణం పూర్తైనా, దానిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.

ప్రస్తుతం గ్రామంలో సేకరిస్తున్న తడి, పొడి చెత్తలను డంపింగ్ షెడ్డు పక్కనున్న రోడ్డు కింద వేస్తున్నారే తప్ప షెడ్డులో వేయకపోవడంతో రైతులు పశువులను కట్టెసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఇటీవల మండల పరిధిలోని ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకుంఠధామలు, డంపింగ్ షెడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తైన వాటిని వెంటనే వినియోగంలోకి తీసుకురాలని ఆదేశించినా, అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement