- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుదుచ్చేరిలో మెజార్టీ కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. గతనెల 25న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ నమశ్శివాయం, ఈ తీప్పయింజన్‌లు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోమవారం మల్లాది కృష్ణారావు, మంగళవారం జాన్ కుమార్‌లు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేశారు. గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ ధనవేలుపై పార్టీవ్యతిరేక కార్యకలాపాల కారణంగా అనర్హతవేటు పడింది. 33 సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ 15 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో అధికారాన్ని చేపట్టింది. కానీ, ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార కూటమి నుంచి దూరమవ్వడంతో నారాయణ స్వామి మెజార్టీ కోల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని అధికార కూటమి, ప్రతిపక్షంలోని బీజేపీ, ఏఐఏడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి సమాన బలాన్ని(14 మంది ఎమ్మెల్యేలు) కలిగి ఉన్నాయి. అసెంబ్లీలో మొత్తం బలమూ 28కి చేరడంతో మెజార్టీ మార్క్ 15గా మారింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలిసారిగా రాహుల్ గాంధీ నేడు పర్యటించనున్న సందర్భంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.