- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆజాద్ అనుభవాన్ని వినియోగించుకోవాలి: కాంగ్రెస్ నేతలు
జమ్ము: దేశంలోని వృద్ధ పార్టీ కాంగ్రెస్ దశాబ్ద కాలంగా బలహీనపడిందని, నవతరం నాయకులను కలుపుకుని ముందుకువెళ్లాల్సిన అవసరముందని ‘జీ-23’ నేతలు కొందరు శనివారం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పనితీరును విమర్శిస్తూ జీ-23 నేతలు గతేడాది బహిరంగంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, ఆనందర్ శర్మ, భూపిందర్ హుడా, గులాం నబీ ఆజాద్‌లు క్యాడర్‌తో పార్టీ నేతలను కలిపే ‘శాంతి సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాలను విమర్శించారు. అలాగే, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇదే కార్యక్రమంలో కపిల్ సిబల్ మాట్లాడుతూ.. గులాం నబీ ఆజాద్ అనుభవాన్ని కాంగ్రెస్ ఇంకా వినియోగించుకోవాల్సి ఉందని, కానీ, ఆయనకు పార్లమెంటు నుంచి రిటైర్‌మెంట్‌కు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతిరాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ వాస్తవ ముఖచిత్రంపై ఆజాద్‌కు అపారమైన అవగాహన ఉందని, ఆయన అనుభవాన్ని పార్టీ మరికొన్నాళ్లు ఉపయోగించుకోవాల్సిందని అన్నారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించాలనే జమ్ములో కలిశామని తెలిపారు. పార్టీ దినదినం బలహీన పడుతున్నదని, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని చెప్పారు. 1950 తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్ నుంచి రాజ్యసభలో ప్రతినిధి లేకుండా పోయారని, త్వరలోనే ఈ లోటును భర్తీ చేస్తామని మరో నేత ఆనందర్ శర్మ అన్నారు. తమ అభిప్రాయాలన్నీ పార్టీని పటిష్టం చేయడానికేనని, పార్టీ యువతతో అనుసంధానమవ్వాలని చెప్పారు. తాము కాంగ్రెస్ నేతలమా? కాదా? అని నిర్ధారించే హక్కును ఎవ్వరికీ ఇవ్వలేదని, ఎవరికీ ఆ హక్కు లేదనీ వివరించారు. తామంతా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించామని, విద్యార్థి, యువజన రాజకీయాల నుంచి పార్టీలో చేరామని అన్నారు. తాము పార్టీని మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. రాజబబ్బార్ మాట్లాడుతూ, ‘కొందరు మమ్మల్ని జీ-23 అంటున్నారు. నాకు ఈ కూటమి గాంధీ-23గానే కనిపిస్తున్నది. మహాత్మా గాంధీ ఆలోచనలు, విశ్వాసాలే పునాదిగా దేశ చట్టాలు, రాజ్యాంగమూ ఏర్పడింది. కాంగ్రెస్ వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బలంగా నిలబడి ఉన్నది. కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని జీ-23 భావిస్తున్నది’ అని వివరించారు.