- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం ఈ మేరకు గాంధీభవన్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. వ్యవసాయన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడితే రైతులను తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు. కాగా ఇప్పటికే రైతుల పోరాటానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్‌కు సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటించారు.
Next Story