ఓటు హక్కు వినియోగించుకున్న జానారెడ్డి

by Shyam |
ఓటు హక్కు వినియోగించుకున్న జానారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగార్జున సాగర్‌ హిల్‌కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి కుటుంబం సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ జరగాలని అన్నారు. వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా, నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా, మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ సెంటర్‌ వద్ద థర్మల్‌ స్కానింగ్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

Advertisement

Next Story