- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘చేతు’లెత్తేసిన కాంగ్రెస్.. కేవలం రెండు స్థానాల్లోనే పోటీ
దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన పట్టును నిలుపుకునేందుకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూ వస్తోంది. అయితే, ఇప్పటికే దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవాలా వద్దా అన్నదానిపై తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అన్ని స్థానాల్లో నిలవాలనుకున్నా.. డీసీసీ అధ్యక్షుల సూచనలతో వెనకడుగేసింది.
అయితే, పార్టీ కేడర్‌తో చర్చించిన అనంతరం రెండు స్థానాల్లోనే బరిలో దిగనున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, రాయల నాగేశ్వరరావు పేర్లను పార్టీ అధిష్టానానికి టీ కాంగ్రెస్ పంపింది. మెదక్ జిల్లా నుంచి నిర్మల, ఖమ్మం నుంచి రాయల నాగేశ్వరరావు బరిలో దిగనున్నారు. అయితే, ముందుగా అన్ని జిల్లాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఓట్లు లేవని డీసీసీ అధ్యక్షులు చెప్పడంతో కేవలం రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. అయితే, అధికార టీఆర్ఎస్ ఇప్పటికే 12 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.