- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ వార్నింగ్.. సీతక్క జోలికొస్తే ఊరుకోం.. చంపడానికైనా రెడీ
దిశ, మణుగూరు : కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతీ కార్యకర్తకు కన్నతల్లిలాంటిది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి కానీ, ఆమె కుమారుడు సూర్య జోలికి కానీ వస్తే మూడు ముక్కులుగా చీల్చేస్తా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అచ్చ నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పని చేసే కొంత మంది నాయకులు సీతక్క గురించి వేటకారంగా మాట్లాడుతున్నారని, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి మరో సోనియా గాంధీనే.. మా అక్క సీతక్క అని తెలిపారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ కోసం చస్తా.. లేదా చంపేస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు నాయకులు కాంగ్రెస్‌లో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, ఆమె కుమారుడు సూర్య గురించి అసభ్యకరంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరైనది కాదన్నారు.
ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సీతక్క, సూర్య.. పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న తమ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల ఫంక్షన్స్‌కు రాకూడదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీతక్క ఫ్యామిలీ గురించి తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు. లేకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. జై సీతక్క.. జై కాంగ్రెస్ అని నినాదాలు చేశారు.