నల్లగొండ ఓట్ల లెక్కింపులో మళ్లీ గందరగోళం.. పోలీసుల ప్రవర్తనపై అనుమానాలు

by Shyam |
నల్లగొండ ఓట్ల లెక్కింపులో మళ్లీ గందరగోళం.. పోలీసుల ప్రవర్తనపై అనుమానాలు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో బుధవారం బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసే విషయంలో గందరగోళం నెలకొంది. సీల్ లేని బాక్సులను తాళాలు పగలకొట్టి ఓపెన్ చేయడం వివాదస్పదంగా మారింది. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ మరోసారి స్వల్ప ఉద్రికత్త ఏర్పడింది. ఎమ్మెల్సీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న ఏజెంట్ల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరిగే హాల్ నంబరు 8లో నుంచి రెండు బ్యాలెట్ పేపర్లను తీసుకుని పోలీసు కానిస్టేబుల్ బయటకు వెళ్లారనే ఆరోపణలు వినిపించాయి. అయితే సదరు కానిస్టేబుల్‌ను ఆ బ్యాలెట్ పేపర్లను చూపించాలంటూ ఏజంట్లు డిమాండ్ చేశారు. అయినా బ్యాలెట్ పేపర్లు చూపించకుండానే కానిస్టేబుల్ బయటకు వెళ్లారు. అసలే ఆ బ్యాలెట్ పేపర్ ఎక్కడిదనే అనుమానాన్ని ఏజెంట్లు వ్యక్తం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. పోలీసుల ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed