- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు కాలేదని గొడవ.. భార్య ఆత్మహత్య
దిశ. కొడంగల్: పిల్లలు కాలేదని భార్య భర్తల మధ్య గొడవ జరుగ్గా, తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని యాంకి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మాల నర్సింగమ్మ, మాణిక్యప్ప గత 10 ఏళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్ళైన నాటి నుంచి వీరు ఇరువురూ హైదరాబాద్‌లో ఉంటూ జీవనం కొనసాగించారు. వీరికి ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. అప్పటి నుంచి మళ్లీ వీరికి మళ్లీ పిల్లలు పుట్టలేదు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో భార్యాభర్తలు స్వగ్రామం యాంకికి వచ్చారు. పిల్లల విషయమై తరుచూ గొడవపడే భార్యభర్తల మధ్య గురువారం రాత్రి కూడా గొడవ జరిగింది. తాగిన మైకంలో ఉన్న భర్త మాణిక్యప్ప వేరే పెళ్లి చేసుకుంటానని భార్యతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన చెందిన మృతురాలు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం మత్తులో ఉన్న మృతు రాలి భర్త మాణిక్యప్ప ఉదయం లేచి చూడగా, భార్య అప్పటికే ఉరేసుకుని చనిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మాణిక్యప్ప భార్యకు ఉరి తీసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. తన స్నేహితునికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపాడు. మృతురాలి తలిదండ్రులు తమ కన్నకూతురిని చూసి గుండెలవిసేల రోదించారు. సమాచారం అందుకున్నసీఐ నాగేశ్వర్ రావు, ఎస్సై విశ్వజాన్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి అన్న మాల సీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపాడు.