- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటి దీపోత్సవానికి వెళ్లాలి అనుకుంటున్నారా..? రూల్స్ ఇవే!
దిశ, డైనమిక్ బ్యూరో : కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవానికి రంగం సిద్ధమైంది. మహిళలంతా ఏకమై శివనామ స్మరణల మధ్య జరిగే దీపోత్సవం గత ఏడాది కరోనా కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో ఈ ఏడాది కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 12న సాయంత్రం 5.30 గంటలకు జరిగే కోటి దీపోత్సవ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమాలు ఈ నెల 12 వ తేది నుంచి 22 వ తేది వరకు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ప్రతి రోజు కార్తీకమాసంలో చేయాల్సిన ప్రత్యేక పూజలు, వ్రతాలు, ప్రవచనామృతాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్తీకమాసం ప్రాముఖ్యతను పీఠాధిపతులు, సద్గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు వివరించనున్నారు. అయితే, కరోనా దృష్ట్యా కొవిడ్ నిబంధనల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈక్రమంలో కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిన వారికి కరోనా నెగిటెవ్ సర్టిఫికేట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. అందువల్ల భక్తులు దీనిని గమనించి, సహకరించాలని కోటి దీపోత్సవం నిర్వాహకులు కోరారు.