కామారెడ్డి స్వాతంత్ర్య వేడుకలపై సర్వత్రా చర్చ

by  |
కామారెడ్డి స్వాతంత్ర్య వేడుకలపై సర్వత్రా చర్చ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. రాష్ర్ట వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాపు కార్యాలయాలలో శాసన సభ్యులు జండాను ఎగురవేశారు. కానీ, ఎక్కడా వారసులు, నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలు జెండాను ఎగురవేయలేదు. బాన్సువాడ నుంచి శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేశారు.

బాన్సువాడలోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఎగుర వేశారు. భారత దేశానికి స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికీ ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు దుద్దుల అంజిరెడ్డి, బాన్సువాడ మండల ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాత బాలకృష్ణ, పీఏసీ ఎస్ చైర్మన్ కృష్ణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, ఎజాజ్, గురువినయ్, బాబా, దాసరి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed