- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
18 ప్లస్‌కు తొలిరోజే అవాంతరాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 18 ప్లస్ అందిరికి ఉచిత వ్యాక్సిన్ ప్రారంభించిన తొలిరోజే అవాంతరాలు ఎదురయ్యాయి. వ్యాక్సిన్ అందించేందుకు నిర్వహించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు రాండంతో పలు చోట్ల వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. తొలి రోజు వ్యాక్సిన్ కోసం టీకా సెంటర్ల ముందు ప్రజలు భారులు తీరారు. అధికంగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు చేపట్టడంతో కోవిన్ వెబ్ పోర్టల్ ఒక్కసారిగా డౌన్ అయింది. లబ్ధిదారుల వివరాలు నమోదు కాకపోవడం, వ్యాక్సిన్ రిపోర్ట్‌లు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పలు టీకా సెంటర్లలో వ్యాక్సిన్ నిలిపివేయడంతో నిరాశగా ప్రజలు వెనుదిరిగారు. కాగా, వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో మొత్తం 905 టీకా సెంటర్లను ఏర్పాటు చేశారు.
18 ప్లస్‌కు ప్రారంభమైన వ్యాక్సినేషన్
ప్రధాని మోడీ ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలో 18 ప్లస్ వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రానికి కావల్సిన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు టీకా సెంటర్లు వ్యాక్సిన్ అందించేదుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ప్రకటనతో వ్యాక్సిన్ కోసం తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు టీకా సెంటర్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 905 టీకా సెంటర్లుండగా వీటిలో ప్రభుత్వ పరిధిలో 849 టీకా సెంటర్లను, ప్రైవేటు పరిధిలో 56 టీకా సెంటర్లున్నాయి. పరిస్థితులను బట్టి మరిన్ని టీకా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.
కోవిన్ వెబ్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు
ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో భారీ స్థాయిలో స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టారు. దీంతో కోవిన్ వెబ్ పోర్టల్ లో పలు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. లక్షల సంఖ్యలో ఒక్కసారిగా కోవిన్ వెబ్ పోర్టల్ ను వినియోగించగా సర్వర్ డౌన్ అయింది. ప్రజలు భారీగా తరలిరావడంతో ఈ సమస్యలు ఎదురయాయ్యాయి. లబ్ధిదారుల వివరాలు నమోద చేసేందకు కోవిన్ వెబ్ పోర్టల్ సహకరించకపోవడంతో పలు సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వేలాది మంది ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.
ప్రైవేటు టీకా సెంటర్లలో ఆందోళన
ప్రైవేటు టీకా సెంటర్లలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు రిపోర్ట్ కోసం ఆందోళన చేపట్టారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీకాలు వేసిన ప్రైవేటు సిబ్బంది.. రిపోర్ట్‌లను అందించలేకపోయారు. కోవిన్ వెబ్ పోర్టల్ సర్వర్ డౌన్ కావడం వలన వ్యాక్సిన్ రిపోర్ట్‌లు అందలేదు. దీంతో వ్యాక్సిన్ కొనుగోళు చేసిన వారు తమకు రిపోర్ట్ కావల్సిందేనని ఆందోళన చేపట్టారు. సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ప్రైవేటు టీకా సెంటర్ల సిబ్బందిని తలలు పట్టుకున్నారు.