ఆ జిల్లాలో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్

దిశ, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో మళ్లీ జిల్లా కేంద్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం అన్ని రాజకీయ పార్టీల నేతలు సమావేశం అయ్యి ఆగష్టు 5 నుంచి 15 వరకూ స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి నివేధించారు. దీనికి పట్టణ ప్రజలు, వర్తక వాణిజ్య సంస్థలు సహకరించి లాక్‌డౌన్ పాటించి, కరోనా బారినుండి బయటపడాలని కోరారు.

Advertisement