- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాన్సువాడలో 7 నుంచి సంపూర్ణ లాక్ డౌన్
by Shyam |

X
దిశ, బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈ నెల 7 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పట్టణంలో గల దుకాణాల అధ్యక్షులు, కార్యదర్శులు పట్టణ అఖిలపక్ష నాయకులు అందకూ స్థానిక గెస్ట్‌హౌస్‌లో సమావేశం అయ్యారు.
అందరి ఏకాభిప్రాయం మేరకు సంపూర్ణ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పదిరోజుల పాటు అమలులో ఉండే లాక్‌డౌన్ కాలంలో నిత్యావసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పాలు, కూరగాయలు, కిరాణం అందుబాటులో ఉంటాయి. అలాగే అత్యవసరమైన మెడికల్, హాస్పిటల్‌లకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 07 నుంచి 17 వరకు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
Next Story